ప్రభుత్వ కార్యాలయాల గురుంచి గూగుల్ తల్లికి చెప్తే ఎలా ఉంటది 🤔.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 😀😀😀. ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని అనిపించింది. అందుకే ఈబ్లాగ్ పోస్ట్ రాస్తున్న. రెండేళ్ల క్రితం మాకున్న పొలాన్ని మీ ఊరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) లో కుదవ పెట్టి దీర్ఘకాలిక రుణం పొందటానికి mortgage deed రిజిస్ట్రేషన చేయించాల్సి వచ్చి మా తిరువూరు సబ్ రిజిస్ట్రార్ గారి కార్యాలయం కి వెళ్లాను. మొదట్లో అది ఎక్కడో తెలియక దారిన ఎదురయ్యే వారిని అడుగుతూ చివరికి కార్యాలయానికి చేరుకున్న. నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ గూగుల్ మాప్స్ లో చూసుకోలేకపోయాను.ఆరోజు ఉదయం 9 కి వెళ్లిన నేను సాయంత్రం 5 అయింది కార్యాలయం నుంచి బయటపడే సరికి. అప్పుడు అనాలోచితంగానే గూగుల్ మాప్స్ తెరిచి సబ్ రిజిస్ట్రార్ గారి కార్యాలయాన్ని గూగుల్ మాప్స్ లో చేర్చా. అలాగే ముఖ్యమైన ఒకట్రెండు ఛాయా చిత్రాలను కూడా అందులో చేర్చా. ఇక ఇంటికి వచ్చాక కార్యాలయం కి సంబంధిచిన నా అనుభవాన్ని feedback రూపం లో గూగుల్ రివ్యూ కింద సవివరంగా వివరించా. ఆ తర్వాత పెద్దగా ఆ అడ్రస్ ను నేను గూగుల్ లో చూడలేదు. కానీ మొన్న మరలా ఆ కార్యాలయంతో పని వచ్చింది. సరదాగా తెరిచి చూస్తే నా రివ్యూ తో పాటు మారికొన్ని రివ్యూలు జత అయ్యాయి. దానితో పాటు మరికొన్ని ఛాయా చిత్రాలు కూడా ! నాకప్పుడు అనిపించి.....మనం వేసే చిన్న అడుగు మరెందరికో స్ఫూర్తి మంత్రం అని. చేర్చిన రివ్యూలలో కొన్ని విమర్శనాత్మకంగానూ ఉన్నాయి. ఈ రివ్యూలు,రేటింగ్లు ప్రభుత్వ కార్యాలయాలను సరిద్దడానికి, అధికారులు మరింత బాధ్యతాయుతంగా పని చేయడానకి దోహదం చేస్తాయి. కాబట్టి మీరుకూడా ఈ కొత్త సంవత్సరంలో ఎపుడైనా ఏదైనా ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శిస్తే తప్పకుండా మీ feedback మరియు రేటింగ్ ని గూగుల్ లో చేర్చండి. తద్వార ప్రభుత్వ కార్యాలయాల్లో పని తీరుని మెరుగుపర్చండి. సమాప్తం😀.

No comments:

Post a Comment