రిలయన్స్ ఇండస్ట్రీస్ నిష్క్రమణకు కారణం.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తో రిలయన్స్ ఇండస్ట్రీస్ 2018 Feb లో 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి MoU కుదుర్చుకున్నారు. కంపెనీ కోరిన స్థలం 150 ఎకరాలు. భూ సేకరణ లో సహజంగా ఏ ప్రభుత్వానికి అయినా భూ యజమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా రైతులు పరిహారం దగ్గర అసంతృప్తి చెందారు.ఇదే విషయం మీద కోర్టుని ఆశ్రయించడం,స్టే ఆర్డర్ రావడం జరిగింది. దాదాపు రెండేళ్లకు కంపెనీ ఆంద్రప్రదేశ్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ నిష్క్రమణకు కారణం సకాలం లో ప్రభుత్వం భూమి అందించకపోవడం అనేది విస్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వం అటు రైతులు సంతృప్తి చెందేలా పరిహారం ఇవ్వడం ద్వార ఈ సమస్య కి ఎప్పుడో పరిష్కారం లభించేది. ఒకవేళ వారు అందుకు ఒప్పుకోని యెడల వేరే భూములు కంపెనీ కి ఇచ్చి ఆ విదంగా కంపెనీ ని బుజ్జగించే పని చేయాలి. ఇప్పుడు రిలయన్స్ లాంటి కంపెనీ నిష్క్రమిస్తే తర్వాత కంపెనీ లు రాడానికి కూడా ఆసక్తి చూపవు. మొన్న asia pulp and paper, నిన్న franklin templeton , నేడు reliance industries. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నిష్క్రమిస్తే మన రాష్ట్రం అభివృద్ధిలో అట్టడుగున పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించడం లో చాలా వెనుకబడి ఉంది. సంక్షేమం డబ్బులు పంచడం ద్వారానే కాదు,ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వార కూడా సంక్షేమం చేయొచ్చు.