ఎంతకాలం ఈ బానిస బుద్ది !

జనం మారనంత వరకు ప్రపంచం లో ఏది మారదు. మార్పు జనాలతో మొదలు కావాలి. జనాల మస్తిష్కం లో మొదలు కావాలి". జనాలు ఓటు ని ఎప్పుడైతే చిల్లరకు అమ్మడం మొదలు పెట్టారో, రాజకీయ నాయకులకి డబ్బు అవసరం ఏర్పడింది, చేసిన పనులుని & చేయబోయే పనుల్ని చూపించి ఓటును అడగడం కాకుండ డబ్బుని చూపించి అడగడం మొదలు పెట్టారు. రాజకీయ నాయకుల డబ్బు అవసరం వ్యాపారస్తులు, కార్పొరేట్లు తీర్చడం మొదలు పెట్టారు. అందుకు గాను వారు చేసే వ్యాపారానికి అనధికార అనుమతులు,ఏదైనా తేడా వస్తే చూసుకోడానికి రాజకీయనాయకులు ఉన్నారు. ఈ వ్యాపారస్తులు,కార్పొరేట్లు సమయం వచ్చినప్పుడుల్లా(కోవిడ్) జనాలను దోచుకోవడం మొదలు పెట్టారు. అలా రాజకీయనాయకుల డబ్బు అవసరం ఈ విదంగా తీరుస్తారు. ఒకసారి డబ్బు ఎలా ప్రవహిస్తుందో చూస్తే.... "జనం --> కంపెనీలు --> రాజకీయనాయకులు --> జనం" ఒక త్రిభుజం అనేది ఏర్పడింది. ఈ త్రిభుజం లో బాగు పడేది ఎవరు అంటే కంపెనీలు, రాజకీయ నాయకులు. డబ్బులిస్తే పరీక్ష పాస్ చేస్తారు అంటే ఇక ఎవడైనా చదువుతాడా? జనం కనుక డబ్బుకు అమ్ముడు పోకుండా, ఎప్పుడైతే ఓటును గత కాలం లో ఏం చేశారు, రాబోయే కాలం లో ఏం చేస్తారు అన్న ప్రాతి పదికన ఆలోచిస్తారో అప్పుడు పైన చెప్పిన Vicious Nexus అనేది బ్రేక్ అవుతుంది. ఇక చచ్చినట్లు నాయకులు జనాల కోసం ఎదో ఒక పని చేయటానికి సిద్ధం అవుతారు. కోవిడ్ కాలం లో మనం చూసాం ప్రభుత్వాలు ఎలా చేతులు ఎత్తేసాయో. మొదటి వేవ్ లో పాఠాలు నేర్చుకోకుండ అలానే నిద్ర పోయారు. కానీ ఆ నిర్లక్ష్యం వల్ల ఎన్నో కుటుంబాలు నేలకొరిగాయి. చిన్న పిల్లలు అనాధలు అయ్యారు. ఒకరకంగా చెప్పాలి అంటే కోవిడ్ ఒక అప్రకటిత మూడో ప్రపంచ యుద్ధం. కోవిడ్ చాలా పాఠాలు నేర్పింది. వ్యవస్థలో ఉన్న నిర్మాణాత్మక లోపాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసింది. ఇది ఒక లిట్మస్ పరీక్ష లాంటిది. దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఏదైనా జరగొచ్చు. --The End --