నోటరీ ఫీజులో లేదు పారదర్శకత. నా అనుభవం ఏమిటో చదవండి.

ఈరోజు మొదటిసారి అఫిడవిట్ కి నోటరీ పని మీద మా గ్రామానికి దగ్గరలోని అడ్వకేటు మరియు నోటరీ దగ్గరికి వెళ్ళాను. కాసేపు కూర్చోండి అన్నారు. ఆ తర్వాత రమ్మని పిలిచారు...వెళ్ళాను.ఇరవై రూపాయల స్టాంప్ పేపర్ మీద ప్రింట్ తీసి నోటరీ స్టాంప్ అంటించి నోటరీ చేశారు. ఎంత అని అడిగితే రెండు వందలు అన్నారు. నేను తగ్గించండి అని అడగలేక అలా అని అడిగినంత ఇవ్వడానికి మనసు అంగీరించక అనాలోచితంగా అడ్వకేట్ చేతిలో పెట్టేసా. రసీదు ఏమైనా ఇస్తారా అండి ? అని ధైర్యం కూడదీసుకుని అడిగా 😉. వెంటనే అతను కిందకిపైకి చూసి మారు మాట్లాడకుండ అతని సిస్టం వైపు చూస్తూ పని కొనసాగించారు. ఇంటికి వచ్చాక అంతర్జాలం లో వెతకడం మొదలు పెట్టా. నోటరీ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలిశాయి. నోటరీ కి సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది. అదే నోటరీస్ చట్టం,1952 మరియు దానికి నోటరీస్ రూల్స్ 1956 పొందుపర్చబడ్డాయి. ముఖ్యంగా రూల్ 10 లో ఎంత ఫీజు వసూలు చేయాలో సవివరంగ చెప్పడం జరిగింది. అలాగే రూల్ 10 సబ్ రూల్ 2 లో నోటరీ ఆఫీస్ ముందు ఈ ఫీజు వివరాలు ప్రదర్శించాలి.
దానితో పాటు మనం తెలుసుకోవాల్సిన విషయం రూల్ 11 సబ్ రూల్ 9 లో ఉంది. అదేంటి అంటే చేసిన ప్రతీ నోటరీకి ఎంత ఫీజు తీసుకున్నారో దానికి ఒక రసీదు ఇవ్వాలి. అలాగే ఫీజు వివరాలు ఒక రిజిస్టర్ లో నమోదు చేయాలి.
ఇవన్నీ తెలుసుకున్నాక అర్థం అయింది ఏంటి అంటే నా దగ్గర అధికంగా ఫీజు వసూలు చేశారు. అలాగే అసలు ఆ నోటరీ ఆఫీస్ వద్ద ఎటువంటి ఫీజు వివరాలు తెలియజేసే బోర్డు లేదు. నేను చెల్లించినందుకు నాకు ఎటువంటి రసీదును ఇవ్వలేదు. అందుకే మీరు ఎవరైనా నోటరీ కోసం వెళ్ళినప్పుడు అధికంగా ఫీజు వసూలు చేయాలని చూస్తే ఒక్కసారి రూల్ 10 గురుంచి ప్రస్తావించండి. ఏ విషయం లో అయితే మనకు అవగాహన ఉండదో.... అందులోనే మనం మోసపోతాము. అవగాహన చేసుకోండి. నా బ్లాగ్ పోస్ట్ చదివినందుకు ధన్యవాదాలు.😀😀😀

ప్రభుత్వ కార్యాలయాల గురుంచి గూగుల్ తల్లికి చెప్తే ఎలా ఉంటది 🤔.

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 😀😀😀. ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని అనిపించింది. అందుకే ఈబ్లాగ్ పోస్ట్ రాస్తున్న. రెండేళ్ల క్రితం మాకున్న పొలాన్ని మీ ఊరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) లో కుదవ పెట్టి దీర్ఘకాలిక రుణం పొందటానికి mortgage deed రిజిస్ట్రేషన చేయించాల్సి వచ్చి మా తిరువూరు సబ్ రిజిస్ట్రార్ గారి కార్యాలయం కి వెళ్లాను. మొదట్లో అది ఎక్కడో తెలియక దారిన ఎదురయ్యే వారిని అడుగుతూ చివరికి కార్యాలయానికి చేరుకున్న. నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నప్పటికీ గూగుల్ మాప్స్ లో చూసుకోలేకపోయాను.ఆరోజు ఉదయం 9 కి వెళ్లిన నేను సాయంత్రం 5 అయింది కార్యాలయం నుంచి బయటపడే సరికి. అప్పుడు అనాలోచితంగానే గూగుల్ మాప్స్ తెరిచి సబ్ రిజిస్ట్రార్ గారి కార్యాలయాన్ని గూగుల్ మాప్స్ లో చేర్చా. అలాగే ముఖ్యమైన ఒకట్రెండు ఛాయా చిత్రాలను కూడా అందులో చేర్చా. ఇక ఇంటికి వచ్చాక కార్యాలయం కి సంబంధిచిన నా అనుభవాన్ని feedback రూపం లో గూగుల్ రివ్యూ కింద సవివరంగా వివరించా. ఆ తర్వాత పెద్దగా ఆ అడ్రస్ ను నేను గూగుల్ లో చూడలేదు. కానీ మొన్న మరలా ఆ కార్యాలయంతో పని వచ్చింది. సరదాగా తెరిచి చూస్తే నా రివ్యూ తో పాటు మారికొన్ని రివ్యూలు జత అయ్యాయి. దానితో పాటు మరికొన్ని ఛాయా చిత్రాలు కూడా ! నాకప్పుడు అనిపించి.....మనం వేసే చిన్న అడుగు మరెందరికో స్ఫూర్తి మంత్రం అని. చేర్చిన రివ్యూలలో కొన్ని విమర్శనాత్మకంగానూ ఉన్నాయి. ఈ రివ్యూలు,రేటింగ్లు ప్రభుత్వ కార్యాలయాలను సరిద్దడానికి, అధికారులు మరింత బాధ్యతాయుతంగా పని చేయడానకి దోహదం చేస్తాయి. కాబట్టి మీరుకూడా ఈ కొత్త సంవత్సరంలో ఎపుడైనా ఏదైనా ప్రభుత్వ కార్యాలయాన్ని సందర్శిస్తే తప్పకుండా మీ feedback మరియు రేటింగ్ ని గూగుల్ లో చేర్చండి. తద్వార ప్రభుత్వ కార్యాలయాల్లో పని తీరుని మెరుగుపర్చండి. సమాప్తం😀.