Pages

సామాన్యుడికి దూరం అవుతున్న రైలు బండి




Image source : Business Today.



మునుపెన్నడూ లేని విదంగా భారత రైల్వే వ్యవస్థ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తుంది. స్వదేశీ గడ్డ మీద తయారైన వందేభారత్ రైళ్లను పట్టాల మీద పరుగులు పెట్టించడం డెబ్భై ఐదేళ్ల స్వాతంత్ర భారతానికి గర్వకారణం తో పాటు జాతి పితకి అసలైన నివాళి.

భారత రైల్వే వ్యవస్థ ని స్మృశించకుండా ఆధునిక భారత దేశ చరిత్ర ని సంపూర్తిగా తెలుసుకోలేము అనడం అతిశయోక్తి కాదు. సామాన్యుడి రధం గా ముద్ర పడిన రైలు బండి సంస్కరణ దిశగా పయనిస్తున్నప్పటికీ అది సామాన్యుడి కి అందనంత దూరంగా వెళ్తుంది అన్నది నేటి చేదు వాస్తవం.


విడదీయరాని అనుబంధం - భద్రతకు భరోసా:


బ్రిటిష్ వారి దోపిడీ కార్యక్రమం కోసం రైళ్లను ఆరంభించినప్పటికి కాలక్రమేన స్వాతంత్ర భారత సామాన్యుడికి జీవనానికి ఊతంగా నిలిచింది. నామమాత్రపు రుసుముల తో సుదూరపు ప్రయాణాలు సైతం రైలు ద్వార సులభమైంది. నేడు రోడ్ల పై ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్లే. నెత్తురోడుతున్న రోడ్లు వాహన చోదకుల్లో తీవ్ర భయాందోళనలు రేకిత్తిస్తున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం ప్రపంచం లో జరిగే 10 రోడ్డు ప్రమాదాల్లో ఒకటి మన దేశంలో జరుగుతుంది అంటే మన దేశంలో రోడ్డు భద్రత ఎంత దీన స్థితిలో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి సంక్లిష్ట స్థితిలో రైల్వే వ్యవస్థ సురక్షిత ప్రయాణానికి ఊతంగా నిలిచింది.


నాణేనికి మరోవైపు:-


    ఒకవైపు వందే భారత్ రైళ్లు పట్టాల మీద పరుగులు పెడుతుంటే మరోవైపు భారత రైల్వే వ్యవస్థ లాభాల్లో అదే జోరు చూపిస్తుంది. ఇటీవల రైల్వేశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రైల్వే 2.40 లక్షల కోట్లు ఆదాయాన్ని ఆర్జించి  25% వృద్ధి ని నమోదు చేసింది. 2026 వ సంవత్సరానికి ముంబయి-అహ్మదాబాద్ మధ్య బులెట్ రైలు ప్రారంభానికి సంసిద్ధంగా ఉన్నట్లు ఇటీవల రైల్వే మంత్రి తేల్చి చెప్పారు.

ఇవి రైల్వే శాఖ యొక్క ఎదుగుదల సూచిస్తున్నప్పటికి పాసెంజర్ రైళ్లు,సిబ్బంది నియామక ప్రక్రియ తదితర విషయాల్లో మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. 


పాసెంజర్ రైళ్లు కనుమరుగు:-


నామమాత్రపు రుసుము తో సామాన్య ప్రయాణికులకు ఆసరాగా నిలిచిన పాసెంజర్ రైళ్లు కోవిడ్ పుణ్యమాన ఇప్పుడు వాటిల్లో ప్రయాణించాలి అంటే ఎక్స్ప్రెస్ రైలు రుసుము చెల్లించాల్సిందే.క్లుప్తంగా చెప్పాలి అంటే నాటి పాసెంజర్ రైళ్లు నేడు కనుమరుగు అయ్యాయి. తీవ్ర ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్న వారికి గొడ్డలి పెట్టులాంటిది ఈ నిర్ణయం. ఒక సగటు పాసెంజర్ రైలు ఎంతో మందికి జీవన ఉపాది కల్పిస్తుంది. తిను బండారాలు అమ్మేవారు,నిత్యం పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లే కార్మికులు మొదలగు అసంఘటిత రంగానికి వెన్నుదన్నుగా నిలిచింది. నేడు అది కనుమరుగు అవ్వడం వారి జీవనుపాధి  మీద తీవ్ర ప్రభావం చూపుతుంది.


గంటలకొద్దీ ఆలస్యం:-


రైలు ప్రయాణ రుసములు పెరగినప్పటికి పాసెంజర్ రైలులో ప్రయాణించే వారికి క్రాసింగ్ ఇబ్బందులు తప్పట్లేదు. ప్రత్యేక రైళ్లు,సూపర్ ఫాస్ట్ తదితర వాటికి మార్గం కొరకు స్టేషన్లలోనే నిలిపేస్తున్నారు. ఒక్కసారి ఆగితే మళ్ళీ బండి ముందుకు ఎప్పుడు కదిలిద్దో తెలీని పరిస్థితి.నిర్ణీత సమయానికి పాసెంజర్ రైళ్లు చేరుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.గంటలకొలది ఆలస్యంతో పాటు ఒక్కోసారి ముందస్తు సమాచారం లేకుండానే పాసెంజర్ రైళ్లను రద్దు చేయడం మొదలగునవి వీటి పట్ల పాలకులకు మరియు అధికారులకు ఉన్న శ్రద్ధాసక్తులను ప్రతిబింబిస్తుంది.


ఇదిలా ఉండగా రైల్వేస్టేషన్ లో రద్దీ నియంత్రణ లక్ష్యంగా రైల్వేశాఖ ప్లాట్ఫారం టికెట్ ధరలు అమాంతం పెంచింది. ఇది ఒకింత మంచి చేస్తున్నప్పటికీ వృద్దులు,దివ్యాంగుల సహాయార్థం గమ్యస్థానం స్టేషన్ కి వచ్చే వారికి ఇది భారంగా మారింది. ప్రయాణ టికెట్ కన్నా ప్లాట్ఫారం టికెట్ ధర ఎక్కువ ఉన్న సంగతులు విధితమే. దరిమిలా అసలు రైలు ప్రయాణం అంటేనే ప్రయాణీకులు నిట్టూర్పు విడిచే పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు కోవిడ్ కి ముందు ఉన్న రాయితీలు సైతం ఇప్పుడు లేకపోవడం రైలు ప్రయాణం వృద్దలకు అదనపు భారంగా మారింది. ఇటీవల రైల్వే స్థాయి సంఘం సీనియర్ సిటిజన్స్ కి ఇచ్చే రాయితీని తిరిగి అందుబాటులో కి తీసుకురావాలి అని సిఫార్సు చేసినప్పటికీ రైల్వేశాఖ దానికి తిరస్కరిస్తూ ఇప్పటికే అన్ని వర్గాల ప్రయాణికులకు 50% పైగా రాయితీ ఇస్తున్నాం కాబట్టి అదనంగా రాయితీలు ఏం అవసరం లేదని తేల్చి చెప్పింది.పెరిగిన జీవన వ్యయం తో పాటు ఆరోగ్య ఖర్చులకు తోడు ఈ రాయితీ నిలుపుదల ఆయా వర్గాల ప్రజలకు ఇదొక పెను భారమే.


లాభాపేక్ష కన్నా ప్రజా ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి:-


భారీ రుసములు తో ఒక వైపు ప్రజల నడ్డి విరుస్తూ మరో వైపు ఎన్ని కోట్లు ఆదాయం అర్జించిన లాభమేమి !  పేద, మధ్య తరగతి ప్రజల కొరకు రైల్వేశాఖ లాభాపేక్ష పక్కనపెట్టి రుసుములు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రచించాలు. రైల్వేశాఖ కు భారీగా ఆదాయాన్ని సమకూర్చే సరుకు రవాణా విభాగం మీద ఖర్చు భారం పెంచి పాసెంజర్ విభాగం లో రుసములు చౌకగా ఉండేలా విధానాలు రూపొందించాలి. వృద్దులకు రాయితీని పునరుద్ధరించాలి. తృతీయ స్థాయి ఆరోగ్య సేవల (tertiary health care services) కొరకు పల్లెల నుంచి మెట్రో నగరాలు రావాల్సి ఉంటుంది. రాయితీలు ఉంటే వారికి ఉపశమనం కలుగుతుంది.


హైదరాబాద్ మెట్రో లాంటి విజయవంతంగా నిర్వహింపబడుతున్న మెట్రోల నుంచి రైల్వేశాఖ వారు స్ఫూర్తి పొందాలి. మెట్రో రైలు లోకి టికెట్ లేకుండా ప్రవేశించడం అసాధ్యం.అటువంటి పటిష్ట వ్యవస్థల్ని భారత రైల్వేశాఖ ఆవలంభించాలి. తద్వారా అధిక రుసుములు వడ్డించకుండానే ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేసే వారు కోకొల్లలు. కొన్ని రాష్ట్రాల్లో టికెట్ అడిగితే ఎక్కడ దాడి చేస్తారో అని సిబ్బంది భయపడే పరిస్థితి ఉంది.  ఇటువంటి వాటిల్లో ఇంకా సంస్కరణలు చేపట్టాలి. టెక్నాలజీ ని అందిపుచ్చుకుని టికెట్ లేని ప్రయానాణానికి అడ్డుకట్టవెయ్యాలి.


  మాజీ రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు నాటి రైల్వే బడ్జెట్ లో ప్రసంగిస్తూ రైల్వే ఆర్థిక స్థితి మెరుగుపడటానికి రుసుము పెంపు ఒక్కటే మార్గం కాదని ప్రకటనలు మొదలగు ఇతర మార్గాలు ఎన్నో ఉన్నాయి అని మంచి మార్గదర్శనం చేశారు.వాటిని నేటి శాఖ భాద్యులు, అధికారులు విస్మరించకుండా ఆచరణ లో పెట్టాలి. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పేద మధ్య తరగతి వారికి రైల్వే ప్రయాణం అందుబాటులో ఉండాలి. వందేభారత్ మరియు బులెట్ రైళ్లు ఆహ్వానించదగ్గవి ఐనప్పటికి వాటి మోజులో పడి ప్రస్తుతం ఉన్న రైళ్ళని విస్మరించవద్దు.

రైల్వే వ్యవస్థ లో ఎన్ని సంస్కరణలు వచ్చిన,ఎన్ని ఆవిష్కరణలు వచ్చినా రైలు ప్రయాణం అందరికి అందుబాటులో ఉంటేనే అసలు లక్ష్యం నెరవేరుతుంది.



-- సమాప్తం --

17 comments:

  1. చక్కటి వ్యాసం వ్రాసారు మీరు.
    మెట్రో రైలు తరహాలో టికెట్ చూపించే పద్దతి మొదలెట్టాలని సాంకేతికపరంగా మీరిచ్చినది చాలా మంచి సూచన.
    రైల్వే ప్లాట్ ఫాం మీదకు టికెట్ లేకుండా ప్రవేశించడానికి వీలు లేకుండా ప్లాట్ ఫారం అన్ని వైపులా అటువంటి గేట్లు పెట్టాలి (platform టికెట్ తీసుకున్న వాళ్ళకి కూడా).

    భారతీయ జనజీవన విధానంతో పెనవేసుకు పోయింది రైలు. ఆ ప్రయాణ సాధనాన్ని తిరిగి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలి. ఈ దిశగా “కార్పొరెట్ట”లను కట్టడి చెయ్యడం / నియంత్రించడం కూడా ముఖ్యం.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు అండి. చాలా ఆనందంగా ఉంది మీ స్పందన చూసాక.
      మీరు మరిన్ని సూచనలు చేస్తే వాటిని తర్వాత రాయబోయే వ్యాసాల్లో అమలు చేస్తాను.

      Delete
  2. కరోనా పేరు చెప్పి రైల్వేలను సేవగా కాక వ్యాపారంగా మార్చేసారు. స్టేషన్లని ఆధునీకరణ పేరుతో ప్రైవేటు కంపెనీలకు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయాణికులకి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఏవో కొన్ని స్టేషన్లని మాల్స్ లా తయారు చేస్తే ప్రజలు మెచ్చరు.

    ReplyDelete
  3. ముందుగా నా వ్యాసాన్ని చదివినందుకు ధన్యవాదాలు.
    మీరు చెప్పినట్లు రైళ్లను ప్రయివేటు పరం చేసే పనిలో కేంద్రం నిమగ్నమయ్యుంది.ఇది చాలా బాధ కారం. ప్రజల అప్రమత్తత అవసరం.

    ReplyDelete
  4. హైదరాబాద్ వంటి నగరాలలో ఇంటి నుంచి స్టేషన్ కు చేరడానికి అయ్యే వ్యయం తో పోలిస్తే రైలు ఛార్జీలు తక్కువగా ఉన్నట్లే. గత పది సంవత్సరాలలో రైల్వేలు, హైవేలు, విమానాశ్రయాల లో మంచి అభివృద్ధి జరిగింది. 100% విద్యుదీకరణ, డబ్లింగ్ జరిగింది. స్టేషన్లలో , రైళ్లలో శుభ్రత సౌకర్యాలు పెరిగాయి.
    నా ఉద్దేశ్యం ప్రకారం 75 సం. పైబడిన వృద్ధులకు 25% రాయితీ ఇస్తే బాగుంటుంది.
    50 ఏళ్ల నాటి రైళ్ల స్థానం లో మెరుగైన, భద్రత కలిగిన రైళ్లు రావడం మంచి పరిణామం.
    సామాన్యులకు ఇప్పటికీ రైలు అందుబాటులో ఉంది. ఉన్న పరిమితులకు సమర్థంగా పనిచేస్తున్న రైలు వ్యవస్థ మనకు ఉంది.
    హైదరాబాదు మెట్రో నష్టాలలో ఉంది. మెట్రో నిర్వహణ లాభదాయకం కాదు. అయితే ప్రజా రవాణాలో ప్రభుత్వ బాధ్యత ఉంది.

    మన దేశ జనాభాకు తగినట్లు ఆర్థిక వనరులను వినియోగించడం అంత సులభం కాదు.

    ReplyDelete
  5. మీరు చెప్పిన దానికి 100% అంగీకరిస్తాను. రైల్వేలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేను కేవలం పాసెంజర్ రైళ్ల గురుంచి మాట్లాడాను. మీరు random గా ఏదైనా పాసెంజర్ రైలు status ని చెక్ చేయండి. అది చాలా ఆలస్యంగా నడుస్తూ ఉంటుంది. విపరీతమైన క్రాసింగ్ లు చాలా ఇబ్బంది కరంగా ఉన్నాయి. మీరు చెప్పిన సంస్కరణలు జరుగుతున్నాయి అన్నది కూడా వాస్తవం.

    ReplyDelete

  6. "సామాన్యు" ని డెఫినిషన్ తెలియ జేయగలరు.

    ReplyDelete
    Replies
    1. “జిలేబి” గారు ‘అసామాన్యులు’, వారిని ఫాలో అయ్యే మా బోంట్లు ‘సామాన్యులు’. మనస్సిలాయో (అర్థమైందా అని మలయాళంలో పృచ్ఛించడం 🙂)?

      Delete
    2. >> “జిలేబి” గారు ‘అసామాన్యులు’, వారిని ఫాలో అయ్యే మా బోంట్లు ‘సామాన్యులు’.
      అవునండి. ఆ అసామాన్యులను ఫాలో అవలేకపోతున్న నాబోంట్లు సామాన్యుల కన్నా హీనం అని ఒప్పేసుకోవాలండి.

      Delete
    3. జిలేబిలు తిని బతికే వాళ్ళు సామాన్యులు, కందమూలాలు తిని బతికే వాళ్ళు మాన్యులు.

      Delete
    4. నిత్యమూ జిలేబీలు తినేవాళ్ళకూ నిత్యమూ కందమూలాలు తినేవాళ్ళకూ కూడా మధుమేహం వస్తుందండీ. ఆయనెవరో వీరమాచినేని రామకృష్ణ గారట - కందమూలాలు కీటోడైట్ కాబట్టి మంచిదంటాడేమో. ఆయన కూడా జిలేబీలు చెడ్డవీ అంటాడేమో అనుకుంటాను. ఐతే చేదుజిలేబీలు మంచివేనేమో మరి!

      Delete
    5. This comment has been removed by the author.

      Delete
  7. There are 2 sides of the coin.

    Till recently, there is no proper accounting in railways. Even now. Only budget support is provided and it is spent. There is no economic evaluation like any firm.

    Is that required. An apt question. When public money is spent, why are they not getting proper service. Late running, no ticket availability etc. Contrarily, in premium trains, there will be tieckts aavilable for the rich and they can travel on last minute purchase also.

    Taking thsi forward, there are two issues that needs to be discussed.
    1. What can be minimum for a ticket. Our train tickets are not increased for at least 10 years. From hyd to bby, train ticket is 500 and bus is anywhere between 1000 and 2000. This subsidy is causing artificial scarcity. Ticetks are over in 1 hour of opening(90 day advance boooking). There is a waiting list of about 200 passengers in each train.

    You rightly pointed "Other than fare increase". Railways is doing that. Previously there were 1 or 2 AC coaches. Now there are at least 5-6. This caused a loss to regular passengers. AC coaches replaced sleeper. Similarly premium trains are increasing at the cost of passenger trains.

    When wer constrain the department, they find their own ways. Is this justifiable?

    As a person with money, i say i like it. At least i am getting a ticket(at twice or thrice the charge). But is this the solution.

    Other side of the coin is for the railways to increase trains and infra. Railways were not given enough money.

    This is a catch 22(socialistic) conundrum.

    ReplyDelete
  8. I agree sir....Tq for reading and giving ur valuable response.

    ReplyDelete
  9. ఏడాదికోసారి ఐదు శాతం చొప్పున రేట్లు పెంచితే ఎవరికీ ఇబ్బంది ఉండదు.
    దొంగచాటు వడ్డనలు సరికాదు.

    ReplyDelete